మేలో స్థానిక సమరం మండల ,జిల్లా పరిషత్ ,పురపాలక ఎన్నికలు సీఎం కేసీఆర్ వెల్లడి cm kcr meeting
మేలో స్థానిక సమరం లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయి అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆ తర్వాత పురపాలక పోరు కొత్త పురపాలక చట్టం రూపకల్పన సీఎం కేసీఆర్ వెల్లడి ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం బడ్జెట్‌కు తుది మెరుగులు ఓటాన్ అకౌంట్ జనరంజకంగా ఉంటుందని వెల్లడి శాసనసభ సమావేశాల నిర్వహణపైనా చర్చ హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు జరపనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన, శాసనసభా సమావేశాల నిర్వహణపై సీఎం బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్, వ్యవసాయ, సంక్షేమ, శాసనసభా వ్యవహారాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్, శాస...