India-Pakistan strengths are ... భారత్-పాక్ బలాబలాలు
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక, ఆయుధ సామర్థ్యం ఎంత? అనే ఆసక్తి నెలకొంది.
క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. 5,000 కిలోమీటర్లలోపు లక్ష్యాలను ఛేదించే అగ్ని-3తో కలిపి ఇటువంటి 9 రకాల క్షిపణి వ్యవస్థలు భారత్‌కు ఉన్నాయి. చైనా సాయంతో పాకిస్థాన్ క్షిపణులను తయారు చేసుకుంటోంది. భారత్‌లోని లక్ష్యాలను ఛేదించగలిగే మొబైల్ షార్ట్, మీడియం రేంజ్ ఆయుధాలు పాక్ వద్ద ఉన్నాయి. 2,750 కి.మీ లక్ష్యాన్ని ఛేదించగలిగే షహీన్ 3తో కలిపి మొత్తం 10 రకాల క్షిపణులు ఉన్నాయి.
స్టాక్ హోం ఇంటర్నెషనల్ పీస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం పాక్ వద్ద సుమారు 140-150 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉండగా, భారత్ వద్ద సుమారు 130-140 ఉన్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ (జీఎఫ్‌పీ) ప్రకారం ప్రకారం ఇరు దేశాల బలాలను పోల్చి చూస్తే..
* మొత్తం 136 దేశాలను పోలుస్తూ జీఎఫ్‌పీ కేటాయించిన ర్యాంకుల్లో భారత్ 4వ స్థానంలో ఉండగా.. పాక్ 17వ స్థానంలో ఉంది.
* భారత జనాభా 128 కోట్లు కాగా పాక్‌ది 20 కోట్లు. వీరిలో దళాలకు అసవరమైన ఫిట్‌నెస్‌తో ఉన్న వారి సంఖ్య భారత్‌లో 48 కోట్లు ఉండగా పాక్‌లో 7.5 కోట్లు మాత్రమే ఉంది.
భారత్ సైన్యం 13 లక్షలు కాగా పాక్ సైన్యం 6.3లక్షలు. ఇక రిజర్వు దళాలను చూస్తే భారత్‌కు 28 లక్షల మంది ఉండగా పాక్‌కు కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే భారత్ వద్ద మొత్తం దళాల సంఖ్య 42లక్షలకు పైమాటే. ఇక పాక్‌వద్ద మొత్తం కలిపితే 9.19లక్షలు మాత్రమే.
* భారత రక్షణ బడ్జెట్ దాదాపు 4,700 కోట్ల డాలర్లు కాగా.. పాక్ రక్షణ బడ్జెట్ 700 కోట్ల డాలర్లు.
వైమానిక దళం..
మొత్తం విమానాల సంఖ్య
భారత్: 2,185, పాక్: 1,281
ఫైటర్ జెట్లు(ఇంటర్ సెప్టర్లు)
భారత్: 590, పాక్: 320
దాడి చేసే విమానాలు
భారత్ : 804, పాక్: 410
రవాణా విమానాలు
భారత్ : 708, పాక్: 296
శిక్షణ విమానాలు
భారత్ : 251, పాక్: 486
హెలికాప్టర్లు
భారత్ : 720, పాక్: 328
దాడి చేసే హెలికాప్టర్లు
భారత్ : 15, పాక్: 49
అందుబాటులో ఉన్న ఎయిర్‌పోర్టులు
భారత్ : 346, పాక్: 151
ట్యాంకు బలగం
భారత్ : 4,426, పాక్: 2,182
సాయుధ పోరాట వాహనాలు
భారత్ : 3,147, పాక్: 2,604
సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టలరీ
భారత్ : 190, పాక్: 307
శతఘ్నులు
భారత్: 4,158, పాక్: 1,240
రాకెట్ ప్రొజెక్టర్లు
భారత్: 266, పాక్: 144
నావికాదళం బలం మొత్తంగా
భారత్: 295, పాక్: 197
విమాన వాహక నౌకలు
భారత్: 1, పాక్: 0
జలాంతర్గాములు
భారత్: 16, పాక్: 5
ఫ్రిగేట్లు
భారత్: 14, పాక్: 10
డెస్ట్రాయర్లు
భారత్: 11, పాక్: 0
కొర్వెట్టిలు
భారత్: 22, పాక్: 0
పోర్టల్ క్రాఫ్ట్
భారత్: 139, పాక్: 11
ప్రధాన యుద్ధనౌకలు
భారత్: 4, పాక్: 3
వాణిజ్యనౌకాబలగం
భారత్: 1,674, పాక్: 52
ప్రధాన నౌకాశ్రయాలు
భారత్: 7, పాక్: 2

Comments
Post a Comment